ఇవి తింటే రోగాలే!.. టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
టీజీసేఫ్ ఎన్ ఫోర్స్మెంట్ విభాగానికి చెందిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి 10 బృందాలతో 20 రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పద కల్తీని పరిశీలించేందుకు 20 ఆహార నమూనాలను సేకరించారు. పలు హోటళ్లలో వంటగదుల అపరిశుభ్రత, బొద్దింకలు, ఈగల బెడద, కుళ్లిన కూరగాయలు, ఆహార పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం వంటి లోపాలను టీజీ-సేఫ్ గుర్తించింది. తనిఖీల్లో పలు హోటళ్ల వంటగదుల్లో నేలలు దెబ్బతినడం, నీరు నిల్వ ఉండటం, గోడలు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, చిమ్మీలపై జిడ్డు పేరుకుపోవడం, బొద్దింకలు, ఈగలు సంచరించడం వంటి లోపాలు బయటపడినట్లు అధికారులు తెలిపారు.
- ఏడు హోటళ్ల లైసెన్సులు సస్పెండ్.. నమూనాల సేకరణ
సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): టీజీసేఫ్ తనిఖీల్లో కొన్ని చోట్ల కూరగాయలు కుళ్లిపోయి ఉండగా, మరికొన్ని చోట్ల ఆహార పదార్థాలపై ఫంగస్ కనిపించిందని, ఫ్రిజ్‌లలో శాకాహార, మాంసాహార పదార్థాలను ఒకేచోట కలిపి నిల్వ చేయడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఉంచడం, వండిన ఆహారాన్ని వార్తాపత్రికలపై పెట్టడం వంటి ప్రజారోగ్యానికి హాని కలిగించే చర్యలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. పీపుల్ కంబైన్ హాస్పిటాలిటీలో పెసరపప్పుపై పురుగుల బెడద, అపరిశుభ్రమైన ఫ్రిజ్ లు, తుప్పుపట్టిన వంట పరికరాలు, సరైన పద్ధతిలో ఆహార పదార్థాలను నిల్వ చేయకపోవడం వంటి లోపాలు గుర్తించారు.
అమ్మచేతి వంటలో కుళ్లిన కూరగాయలు, జీడిపప్పు, శనగపిండి వంటి పదార్థాలపై ఫంగస్ , అపరిశుభ్రమైన ఫ్రీజర్లు, వంట పరికరాలు ఉన్నట్లు అధికారులు పేరొన్నారు. తనూజా హోటల్స్‌లో జారుడుగా మారిన దెబ్బతిన్న వంటగది నేల, ఆహార వ్యర్థాలతో నిండిన డ్రైనేజీ ట్రాప్స్ , బొద్దింకలు, ఈగలు, కుళ్లిన టమాటాలు, నిమ్మకాయలు గుర్తించారు. శ్రీ ఆద్య గ్రాండ్ రెస్టారెంట్ లో ఉపయోగించిన నూనె ముదురు రంగులో ఉండటంతో పాటు, ఫ్రిజ్ లో శాకాహార, మాంసాహార పదార్థాలను కలిపి ఉంచినట్లు తనిఖీల్లో వెల్లడైంది.
అకడ గడువు ముగిసిన, లేబుళ్లు లేని ఆహార పదార్థాలు కూడా గుర్తించారు. ఏవీఆర్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ (సంగం హోటల్ )లో బిర్యానీకి సంబంధించిన మిగిలిపోయిన చికెన్ ముకలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ఆహారంపై ఎలుకల విసర్జనలు, ఫంగస్ పట్టిన మునగకాయ ముకలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైవే హాస్పిటాలిటీలో తినేందుకు ఉపయోగించే ఐస్ ముకలను పచ్చి మాంసంతో కలిపి నిల్వ చేయడం, లేబుళ్లు లేని పదార్థాలు, తుప్పుపట్టిన స్టాండ్లు గుర్తించారు. శ్రీ మమత లాడ్జ్ అండ్ రెస్టారెంట్ లో కుళ్లిన గుడ్లు, చెడిపోయిన కూరగాయలు, జిడ్డు పేరుకుపోయిన స్టవ్ లు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, సరైన డ్రైనేజీ, గాలి ప్రసరణ లేకపోవడాన్ని గుర్తించారు.
ఏడు హోటళ్ల లైసెన్స్‌లు రద్దు..
నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఉన్న పీపుల్ కంబైన్ హాస్పిటాలిటీ ఎల్ఎల్ పీ (7 మిడ్ వే ప్లాజా), నారట్ పల్లిలోని అమ్మచేతి వంట (ఎం/ఎస్ అంజనా టిఫిన్స్ ), సూర్యాపేటలోని తనూజా హోటల్స్ , యాదాద్రి భువనగిరి జిల్లా మలాపూర్ లోని శ్రీ ఆద్య గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్, చౌటుప్పల్ యెల్లగిరి ఎక్స్ రోడ్డులోని ఏవీఆర్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ (సంగం హోటల్ ), సూర్యాపేట జిల్లా రాయణిగూడెం వద్ద ఉన్న హైవే హాస్పిటాలిటీ, సూర్యాపేటలోని శ్రీ మమత లాడ్జ్ అండ్ రెస్టారెంట్ల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా హోటళ్లలో కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించి, వాటిని మూసివేయించారు.
హోటల్ సాయిప్రియ మూసివేత
నల్గొండ జిల్లా నకిరేకల్ లోని హోటల్ సాయిప్రియ ఫ్యామిలీ రెస్టారెంట్ ఎఫ్ ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేకుండా, అపరిశుభ్ర పరిస్థితుల్లో నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దెబ్బతిన్న వంటగది నేలపై నీరు నిల్వ ఉండటం, సిబ్బంది హెయిర్ నెట్స్ , అప్రాన్లు ధరించకపోవడం, అపరిశుభ్రమైన ఫ్రిజ్‌లు, కుళ్లిన కూరగాయలు, వంటగదిలో దుర్వాసనతో పాటు సిబ్బంది ఆరోగ్య రికార్డులు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేకపోవడాన్ని గుర్తించి వెంటనే సదరు రెస్టారెంట్లో కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు.
ఎనిమిది సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు
తనిఖీల్లో గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవాలని ఎనిమిది సంస్థలకు ఇంప్రూవ్ మెంట్ నోటీసులు జారీ చేయనున్నట్లు టీజీ సేఫ్ ప్రకటించింది. వీటిలో సూర్యాపేటలోని పీపుల్ కంబైన్ హాస్పిటాలిటీ, నల్గొండ జిల్లాలోని లిటిల్ విలేజ్ , వివే రా హోటల్ , హోటల్ వింటేజ్ అండ్ వింటేజ్ కేఫ్ , ధారసుత ఫుడ్స్ , సూ ర్యాపేటలోని హోటల్ సాయికృష్ణ, శ్రీ తిరుమల గ్రాండ్ , యాదాద్రి భువనగిరి జిల్లా మలాపూర్ లోని సంగం హోటల్ ఉన్నాయి. తిరిగి తనిఖీలు నిర్వహించి నిబంధనల అమలును పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
ఐదు సంస్థలకు షోకాజ్ నోటీసులు
నల్గొండ జిల్లాలోని హోటల్ సాయిప్రియ ఫ్యామిలీ రెస్టారెంట్, వివేరా ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ ఒరిస్సా ధాబా, మినర్వా కాఫీ షాప్ అండ్ బ్లూ ఫాక్స్ రెస్టారెంట్, యాదాద్రి భువనగిరి జిల్లాలోని విలేజ్ ఆర్గానిక్ కిచెన్లలో నిర్వహించిన తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనలపై షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిపై తదుపరి విచారణ అనంతరం జరిమానాలు విధింననున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

