ఈ-శ్రమ్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి

చిక్కడపల్లి,నవంబర్ 2: జంటనగరాల్లో ఉన్న అసంఘటిత రంగ కార్మికులందరూ తమ పేర్లను తప్పని సరిగా ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని జంటనగరాల సంయుక్త కార్మిక కమిషనర్ డి.శ్యామ్ సుందర్ రెడ్డి సూచించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు కోసం డిసెంబర్ నెలాఖరువరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు ఆయన తెలిపారు.అసంఘటిత కార్మికులందరూ ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా వారికి సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్(ఏఎల్ఓ)లు రెండు నెలల ఈ డ్రైవ్‌లో ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేసి నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తారన్నారు.
అసంఘటిత కార్మికుల పేర్లను సీఎస్సీ(కామన్ సర్వీస్ సెంటర్)లో నమోదు చేసుకుని అక్కడికక్కడే ఐడీ కార్డులు పొందే సదుపాయం కల్పించామన్నారు. కార్మికుల్లో దాదాపు 90 శాతం మంది అసంఘటిత రంగ కార్మికులే ఉన్నారని తెలిపారు. ఈ పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకోవడానికి కార్మికులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో చేరిన ప్రతి అసంఘటిత కార్మికుడికి 12 అంకెలు గల ప్రత్యేక గుర్తింపు కార్డు(యూఏఎన్) -(యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్) ఇస్తామని తెలిపారు.
ఈ కార్డు ఉంటే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు, వివిధ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తాయని వివరించారు. ఇందులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఒక సంవత్సరం పాటు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన(పీఎంఎస్బీవై) కింద రూ.2 లక్షలు, అంగవైకల్యం బీమా ఉచితంగా కల్పిస్తామని తెలిపారు. 16 నుంచి 59 సంవత్సరాల వయస్సులోపు, ఆదాయ పన్ను పరిధిలోకి రానివారు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం లేని వారు అర్హులని తెలిపారు. అసంఘటిత రంగ కార్మిక కేటగిరిలో తప్పని సరిగా పనిచేస్తూ ఉండాలని వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- e shram portal
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

