సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ తీసుకుంటూ వీడియో తీసి, దానిని గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేశారు. దీనిపై సీసీఎస్ సైబర్‌క్రైమ్ ఠాణాలో కేసు నమోదయ్యింది.
ఈ ఘటనపై సైబర్‌క్రైమ్ పోలీసులతో పాటు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీనాబ్) కూడా దర్యాప్తు చేస్తుంది. డ్రగ్స్ వాడకంతో పాటు వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై టీనాబ్ సీరియస్‌గా ఉంది. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు తెలిపారు.