ఎల్బీనగర్, నవంబర్ 17: ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి జన నీరాజనం పలుకుతున్నారు. కొత్తపేట డివిజన్లో శుక్రవారం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున హాజరై అడుగడుగునా నీరాజనాలు పలికారు. పూలవర్షంతో పాటు మహిళలు హారతులు పట్టి సుధీర్‌రెడ్డికి స్వాగతం పలికారు. డీజేల మధ్య భారీగా హాజరైన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కొత్తపేట జైన్ మందిర్ నుంచి ఆరంభమైన శంఖారావ యాత్ర కొత్తపేట, సత్యనగర్, మారుతీనగర్, ఎస్ఆర్ఎల్ కాలనీ, ప్రజయ్ నివాస్ 1,2, జనప్రియ క్వార్టర్స్ , బాలాజీకాలనీ, మోహన్‌నగర్, శృంగేరీ కాలనీ, రాఘవేంద్రనగర్, న్యూ నాగోలు నుంచి స్నేహపురి కాలనీ వరకు సాగింది. పాదయాత్రను ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, ఎల్బీనగర్ మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ లింగాల నాగేశ్వర్రావు, మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు లింగాల రాహుల్ గౌడ్‌తో కలిసి పాదయాత్రతో ప్రచారాన్ని నిర్వహించారు.
కాలనీ సంక్షేమ సంఘాలు, బస్తీ సంఘాలు, కుల సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు తమ మద్దతు బీఆర్ఎస్కేనని, తమ ఓటు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికే నంటూ ప్రకటించడంతో పాటు తీర్మాణాలు చేశారు. కాలనీల్లో సుధీర్‌రెడ్డిని ఆత్మీయంగా పలుకరించి అభివృద్ధికి పట్టం కడతామని, కారు గుర్తుకు ఓటు వేస్తామని హామీ ఇచ్చారు. దారి పొడవునా దేవాలయాల్లో పూజలు నిర్వహించడంతో పాటు కాలనీవాసులతో ఆత్మీయంగా పలుకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చా..
ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకు మేలు చేశానని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. కరోనా సమయంలో ప్రజల కోసం పనిచేస్తూ ఆరుమార్లు కరోనా బారిన పడ్డానని, అయినా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, సీనియర్ నాయకుడు లింగాల నాగేశ్వర్రావు, మాజీ కార్పొరేటర్ సాగర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు లింగాల రాహుల్‌గౌడ్, తోట మహేశ్‌యాదవ్, రాగిరి ఉదయ్ గౌడ్, జహీర్‌ఖాన్, మహేశ్‌రెడ్డి, మల్లెపాక యాదగిరి, సాయికుమార్, వరుణ్, జోగు రాములు, కొమ్ము బాబు, కంఠం శ్రీనివాస్, మోరు సురేశ్, నిఖిల్ గౌడ్, తాళ్ల శ్రీశైలం గౌడ్, కన్నయ్య ముదిరాజ్, టి.గజేందర్ సింగ్, జవ్వాజి వెంకటేశ్, నాలుకల నర్సింగ్, మహిళా నాయకురాళ్లు రూపాసింగ్, పద్మ, శ్వేతారెడ్డి, విజయగౌడ్తో పాటు పలువురు నాయకులు, ఉద్యమకారులు, పార్టీ నాయకులు, కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
హయత్‌నగర్, నవంబర్ 17: హయత్‌నగర్ డివిజన్లోని శుభోదయ కాలనీ, సత్యనగర్, వాసవినగర్, సూర్యనగర్ కాలనీల్లో మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, సీనియర్ నాయకులు సింగిరెడ్డి మల్లీశ్వరిరెడ్డి, నక్క రవీందర్‌గౌడ్, భాస్కర్ సాగర్ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధిని చూసి మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ ఎస్సీ సెల్ మాజీ ఉపాధ్యక్షుడు ఏర్పుల దేవ ప్రసన్నకుమార్, నాయకులు భాస్కర్ గుప్తా, పారంద రమేశ్, బల్రాం కురుమ, తదితరులు పాల్గొన్నారు.
చంపాపేట, నవంబర్ 17: ఎల్బీనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి మెజార్టీ తీసుకు రావడమే తమ లక్ష్యమని బీఆర్ఎస్ నేత బసిగూడెం జంగారెడ్డి అన్నారు. శుక్రవారం చంపాపేట డివిజన్ పరిధిలోని రెడ్డిబస్తీ, కటికోనికుంట, నేతాజీకాలనీ, ముస్లిం బస్తీ, ఏడబస్తీల్లో బీఆర్ఎస్ నేతలు బసిగూడెం జంగారెడ్డి, వింజమూరి రాఘవాచారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాయకులు భానుప్రకాశ్‌రెడ్డి, ఏడ శంకర్, భూపతిరెడ్డి, చేగోని మల్లేశ్‌గౌడ్, ముడుపు రాజ్‌కుమార్‌రెడ్డి, ఉమామహేశ్వర్, చందు యాదవ్, ఎలిమినేటి నిషీకాంత్రెడ్డి పాల్గొన్నారు.
మన్సూరాబాద్‌లో కమలాసుధీర్రెడ్డి ప్రచారం..
మన్సూరాబాద్, నవంబర్ 17: బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి మద్దతుగా శుక్రవారం బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డితో కలిసి మన్సూరాబాద్ డివిజన్ పరిధి వీకర్‌సెక్షన్‌కాలనీ, చండీశ్వర్కాలనీ, బాల్‌రెడ్డినగర్, హిమపురికాలనీ, ద్వారకానగర్, స్వాతి రెసిడెన్సీ, శైలజాపురికాలనీ, ఇందిరానగర్ కాలనీల్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సతీమణి కమలాసుధీర్రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న, కర్మన్‌ఘాట్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్, నాయకులు జక్కిడి రఘువీర్‌రెడ్డి, కొసనం ధనలక్ష్మి, అత్తాపురం రాంచంద్రారెడ్డి, రుద్ర యాదగిరి, నర్రి వెంకన్నకురుమ, బాలరాజుగౌడ్, సిద్దగోని నర్సింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నాగోల్‌లో జోరుగా ఎన్నికల ప్రచారం..
నాగోల్ డివిజన్ పరిధి సాయి సుప్రభాత్కాలనీ, కేతన రెవెన్యూ, ఫతుల్లాగూడలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ఎన్నికల ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సతీశ్‌యాదవ్, డప్పు వెంకటేశ్, కాటెపాక రవి, సుర్వి రాజుగౌడ్, కాటెపాక దాస్, గౌరి, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్ గడ్డపై గులాబీ జెండా..
ఎల్బీనగర్, నవంబర్ 17: ఎల్బీనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ లింగోజిగూడ డివిజన్లో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, బీఆర్ఎస్ అధ్యక్షుడు వరప్రసాద్‌రెడ్డి, గ్రీన్‌పార్కు కాలనీ అధ్యక్షుడు జగన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అంజయ్య గౌడ్, మహిపాల్‌రెడ్డి, బాల్‌రెడ్డి, కాశీనాథ్, కోటగిరి శ్రీనివాస్ గౌడ్, కందికంటి శ్రీధర్ గౌడ్, మల్లారపు శ్రీనివాస్‌రావు, తిలక్‌రావు, మధుసాగర్, నర్సిహ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
సుధీర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం..
వనస్థలిపురం, నవంబర్ 17 : ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి తమ సంపూర్ణ మద్ధతు తెలుపుతున్నామని అర్చకులు, పూజారులు ప్రకటించారు. శుక్రవారం వైదేహినగర్ శివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బ్రాహ్మణుల సంక్షేమానికి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఎల్బీనగర్ను అభివృద్ధి చేయడంలో సుధీర్‌రెడ్డి సక్సెస్ అయ్యారన్నారు. నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న నాయకుడన్నారు. అలాంటి వ్యక్తి మరోసారి ఎమ్మెల్యే కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీజేపీ కార్పొరేటర్ వంగా మధుసుదన్‌రెడ్డి తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హరిహర క్షేత్రం అయ్యప్ప దేవాలయాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు. దేవస్థానం నిధులను దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపించారు. కమిటీ సభ్యులను నామ మాత్రం చేసి, ఆయన ప్రచారం చేసుకుంటున్నాడని ఆరోపించారు. సుధీర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు తాము కృషి చేస్తామన్నారు.
బీఆర్ఎస్ వైపు 25 వేల మంది మాలధారణ స్వాములు..
నియోజకవర్గంలోని 25 వేల మంది మాలధారణ స్వాములు బీఆర్ఎస్ వైపు ఉన్నారని శ్రీ శివశక్తి అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు రాజు శివగురు స్వామి అన్నారు. అర్చక, పూజారులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సంస్థ ఆధ్వర్యంలో దీక్ష స్వాములను ఏకం చేస్తున్నామని, అందరూ కారు గుర్తుకు ఓటేసి, సుధీర్‌రెడ్డిని గెలిపిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో సుధీర్ శర్మ, రామ్ శర్మ, ఆనందరావు, గోపాలం గురుస్వామి, రమాకాంత్ శివస్వామి పాల్గొన్నారు.