మేడ్చల్ : బీఆర్ఎస్ పాలనలో పదేండ్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం నేడు పట్టపగలే హత్యలు, దోపిడీలతో ప్రజలకు శాంతి లేదు. భద్రత అసలే లేదనే వాదన వినిపిస్తున్నది. నిత్యం ఏదో ఒకచోట హత్యలు జరుగుతుంటే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా మేడ్చల్లో దొడ్ల మిల్క్ మేనేజర్(Dodla Milk Manager) శ్రీనివాస్ పై కిరణ్ అనే పాల వ్యాపారి తల్వార్తో(Talwar) దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Vijay | విజయ్ సినిమాని సడెన్గా ఇలా వాయిదా వేశారేంటి.. పొలిటికల్ రీజన్సే కారణమా?
Road accident | రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి