వ్యవసాయ యూనివర్సిటీ, జూలై 04: ప్రజల ఆరోగ్య పరిరక్షణ కాపాడటంలో ఆరోగ్య వృత్తిలో రాణించే ప్రతి ఒక్కరికీ బాధ్యత అవసరమని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్) డైరెక్టర్ ప్రొఫెసర్ మూర్తి అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో గల ఐఐపీహెచ్లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పుట్టిన ప్రతి ఒక్కరినీ ఆరోగ్యంగా సంరక్షించడం ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా స్వచ్ఛంద, ప్రయివేటు సంస్థలు కూడా బాధ్యతగా తీసుకోవాలన్నారు.
సమాజంలో మహిళ పాత్ర కీలకమని ఇన్స్పెక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్ (వీఐఏ) టెస్ట్ ఉపయోగించి ‘గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌లో కృత్రిమ మేధస్సు’ అనే అంశంపై ఈ సమావేశం జరిగింది. ఐఐపీహెచ్ విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్ (వీఐఏ) ప్రభావితమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. మానవుని పరివర్తన సామర్థ్యాన్ని అన్వేషించడానికి సాంకేతికత, ఆంకాలజీ, ప్రజారోగ్య రంగాలకు చెందిన నిపుణులు, పరిశోధకులు, వాటాదారులను ఈ ఈవెంట్ ఒక చోట చేర్చినదన్నారు.
గర్భాశయ క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో ముందస్తుగా గుర్తించడం కీలకమైన ప్రాముఖ్యతగా నొక్కి చెప్పారు. రోగ నిర్ధారణ యొక్క వినాశకరమైన పర్యవసానాలను వివరించారు. డబ్య్లూహెచ్ఓ గ్లోబల్ కాల్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఎలిమినేషన్ తదితర అంశాల పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో డా. జగన్నాథ్, డా. లీలా డిగుమార్తి, డా. ఉషారాణి పోలి, డా. శివ నాగేశ్వర్ పాల్గొని పలు సూచనలు చేశారు.