సైదాబాద్ : సాయి సేవా సమితి ఆధ్వర్యంలో అక్బర్‌బాగ్ డివిజన్ పరిధిలోని లూయిస్ బ్రెయిలీ పార్క్‌లో గురువారం దివ్యాంగుల జంట ఆదర్శ వివాహం ఎంతో వైభవంగా జరిగింది. రామలింగం, లక్ష్మీ వివాహంను సాయిసేవాసమితి నిర్వాహకులు నాగమల్ల అనిల్‌కుమార్, అరుణ దంపతులు అన్నితామై వివాహం జరిపించారు.
హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగిన వివాహానికి హాజరైన పలువురు నూతన వధూవరులను ఆశ్వీరదించారు. ఆదర్శ వివాహంకు హాజరైన వారందరికి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కానురి అశ్రీత, కానురి అమ్రిత విందు భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ వివాహంలో పలువురు దివ్యాంగులు, స్నేహితులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.