సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ): జిల్లాలో నూతన రేషన్ కార్డులను నేటి నుంచి 3వ తేదీ వరకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతానికి 55,378 కార్డులను పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ఆమె తెలిపారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని బంజారా భవన్లో ఉదయం 10 గంటలకు, బలంరాయి జింఖానా గ్రౌండ్ ఎదురుగా మధ్యాహ్నం 12 గంటలకు, హబీబ్ ఫాతిమా నగర్ కమ్యూనిటీ హాల్లో 3 గంటలకు మంత్రితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు హాజరై పంపిణీ ప్రారంభిస్తారని చెప్పారు.
2న ఉదయం 10 గంటలకు అంబర్ పేట నియోజకవర్గం, మధ్యాహ్నం 12 గంటలకు మూషీరాబాద్ నియోజకవర్గం, 3 గంటలకు సికింద్రాబాద్ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందన్నారు. 3న ఉదయం చార్మినార్ నియోజకవర్గం, మధ్యాహ్నం 12 గంటలకు కార్వాన్ నియోజకవర్గం, 3 గంటలకు చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో కార్డులను అందజేస్తామని వెల్లడించారు.