భవిష్యత్ తరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేలా పండుగలను నిర్వహించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బుధవారం ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని కార్యాలయంలో సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని 75 దేవాలయాలకు బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం అందిస్తున్న 1.20 కోట్ల విలువైన చెక్కులను ఆలయాల కమిటీ సభ్యులకు అందజేశారు.
ఈ నెల 16న హైదరాబాద్ బోనాలను నిర్వహించనున్న నేపథ్యంలో కార్వాన్, గోషామహల్, కంటోన్మెంట్ తదితర నియోజకవర్గాల పరిధిలోని ఆలయాల నిర్వాహకులకు చెక్కులను అందజేసినట్లు పేర్కొన్నారు. – బేగంపేట్ జూలై 12 2