సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లోని అన్ని బస్ షెల్టర్లలో డిజిటల్ డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. రైల్వే తరహాలో బస్సు రాకపోకలపై కచ్చితమైన సమాచారంతో పాటు ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్నది. ఇందులో భాగంగానే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పద్ధతిలో ఆసక్తి గల ఎజెన్సీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ టెండర్లను పిలిచింది.
బస్సు ప్రయాణం సులభతరం చేయడం, ప్రైవేట్ భాగస్వామ్యం చేసి ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్నది. ఈ మేరకు ఈ నెల 20న దరఖాస్తులు సమర్పణకు గడువు విధించింది. ఆయా ఎజెన్సీలతో ఈ నెల 28న ప్రత్యేక సమావేశం ఉంటుందని, సంబంధిత ప్రజెంటేషన్లు ఎజెన్సీలు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. వచ్చే నెల 21వ తేదీ ఉత్తమ ప్రతిపాదనలను ఖరారు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.