Khairatabad Ganesh | ఖైరతాబాద్, సెప్టెంబర్ 8: ఖైరతాబాద్‌లోని సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు శని, ఆదివారాల్లో భక్తులు పోటెత్తారు. వినాయకచవితి రోజు సీఎం రేవంత్‌రెడ్డి వినాయకుడిని దర్శించుకొని తొలిపూజలు చేశారు. ఖైరతాబాద్ పద్మశాలి సంఘం, తెలంగాణ పద్మశాలి వస్త్రపీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సురేంద్ర మోహన్,
హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్, తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ట్రస్ట్ అధ్యక్షుడు కడారి శ్రీధర్‌తో కలిసి స్వామి వారికి 75 అడుగుల చేనేత కండువ, జంధ్యం, గరికమాల, పట్టువస్ర్తాలను సమర్పించారు. అలాగే మహాగణపతిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.