అంబర్‌పేట : అంబర్‌పేట నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ శారదానగర్‌లో రూ.5లక్షల వ్యయంతో చేపట్టనున్న కమ్యూనిటీహాల్ మరమ్మతు పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మవెంకటరెడ్డితో కలిసి గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట తదితర డివిజన్ల పరిధిలో గల అన్ని బస్తీలు, కాలనీలను అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా బస్తీలు, కాలనీల్లో రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ పైప్లైన్ల ఏర్పాటు, వీధి దీపాలు ఏర్పాటు, పార్కుల అభివృద్ధి వంటివి చేపట్టినట్లు తెలిపారు.
గతంలో ఎన్నడు లేని విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సుధాకర్, వాటర్‌వర్క్ ఏఈ మాజిద్, ఎలక్టికల్ డీఈ వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, డా.సులోచన తదితరులు పాల్గొన్నారు.