సికింద్రాబాద్/వినాయక్‌నగర్/గౌతంనగర్/మల్కాజిగిరి, జూలై 5: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. సోమవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బౌద్ధనగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కౌసర్ మసీదు, ఎల్. నారాయణనగర్, వారాసిగూడ, అంబర్‌నగర్, అల్లాడి రాజ్కుమార్నగర్ తదితర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 32 లక్షలతో బౌద్ధనగర్ వాసుల దాహంను తీర్చామన్నారు. రూ. మూడు కోట్ల 75 లక్షలతో ఇక్కడున్న నాలాపై దశల వారీగా శ్లాబ్ పనులు, రూ. 2. 50 కోట్లతో బౌద్ధనగర్ ప్రధాన రోడ్డును అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కందిశైలజ, డిప్యూటీ కమిషనర్ మోహన్‌రెడ్డి, ఈఈ ఆశలత, శశిధర్‌రెడ్డి, జలమండలి డీజీఎం కృష్ణ, టీఆర్ఎస్ నేతలు రామేశ్వర్‌గౌడ్, కంది నారాయణ పాల్గొన్నారు.
పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలని కార్పొరేటర్ సబితాకిశోర్ అన్నారు. సోమవారం వెంకటాపురం డివిజన్లో పద్మావతికాలనీ, అల్వాల్ డివిజన్లో బండబస్తీ, మచ్చ బొల్లారం డివిజన్లో గోపాల్‌నగర్, వినాయక్‌నగర్ డివిజన్లో కాకతీయనగర్ కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అనిల్‌కిశోర్, శివ, సంతోష్, సాయికుమార్, కవిత, శ్రీనివాస్, సురేందర్‌రెడ్డి, శ్రావణ్, శ్రీశైలం, సాంబ య్య, ఆనంద్, బాబురావు గౌడ్, రాజేశ్ పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం కార్పొరేటర్ మేకల సునీత గౌతంనగర్ డివిజన్లోని సాయినగర్, సంతోషిమా నగర్లో అధికారులతో కలిసి పర్యటించారు.
మౌలాలి డివిజన్ పరిధిలో కార్పొరేటర్ గున్నాల సునీత ఎంజేకాలనీ, గాయత్రీనగర్, మారుతీనగర్, ఈస్ట్ ప్రగతినగర్‌లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు.
పట్టణ ప్రగతిని సద్వినియోగం చేసుకోవాలి
పట్టణ ప్రగతిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ ఊరపల్లి శ్రావణ్‌కుమార్ పిలుపు నిచ్చారు. పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం సఫిల్‌గూడలోని వినాయక నిమజ్జనం చేసే చెరువును ఎంటమాలజీ సిబ్బందితో శుభ్రం చేయించారు.