ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రంలో రోగులకు సేవలందించడంలో ఆశా కార్యకర్తల నిబద్ధత ఎంతో గొప్పదని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు. వారు అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. ఆశ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మొబైల్ ఫోన్లను అందజేస్తోందని చెప్పారు.
ఇందులో భాగంగా తార్నాక డివిజన్లోని లాలాపేట ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ఆశా కార్యకర్తలకు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డితో కలిసి మంగళవారం పద్మారావు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. సీతాఫల్మండి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పద్మారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు అండగా ఉంటోందని చెప్పారు.
వారిని ప్రోత్సహించడంతో పాటు వేతనాలను కూడా గణనీయంగా పెంచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ రాజశ్రీ, డాక్టర్ మోనిక తదితరులు పాల్గొన్నారు.