పోస్ట్కొవిడ్ బాధితుల్లో చిత్త వైకల్యం
84 లక్షల మందిని ఈ అధ్యయనంలో పరీక్షించారు. అందు లో మధ్య వయస్సు నుంచి వృద్ధులకే పోస్ట్ కొవిడ్ సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టు తేలింది
- ఆక్స్ఫర్డ్ వర్సిటీ అధ్యయనం
హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): కరోనా తగ్గినా.. రోగులకు ఆ గాయం సలుపుతూనే ఉన్నది. కరోనా రోగుల్లో ఇప్పటి వరకు ఎక్కువగా శ్వాసకోశ సంబంధ వ్యాధులే కనిపించేవి. కానీ, ఆక్స్ఫర్డ్ వర్సిటీ అధ్యయనంలో కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు తెలిసింది. సైకోసిస్, చిత్తవైకల్యం, బ్రెయి న్ ఫాగ్ వంటి మానసిక, నాడీ సంబంధిత వ్యాధులు వారికి కునుకులేకుండా చేస్తున్నాయని ది లాన్సెట్ సైకియాట్రీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది.
12.84 లక్షల మందిని ఈ అధ్యయనంలో పరీక్షించారు. అందు లో మధ్య వయస్సు నుంచి వృద్ధులకే పోస్ట్ కొవిడ్ సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టు తేలింది. ఆల్ఫా బారినపడినవారే అత్యధికంగా మానసిక, నాడీ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించారు.
కొవిడ్ సోకిన తర్వాత ఆరు నెలల్లోనే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని మొదట్లో తేలిందని, ప్రస్తుతం రెండేండ్ల వరకూ ఆ అవకాశం ఉన్నదని అర్థమవుతున్నదని ఆక్స్ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ పాల్ హారిసన్ తెలిపారు. వీటి నివారణకు పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

