స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
స్వర్ణకారుల సమస్యలను ప్రభుత్వానికి విన్నవించడంతో పాటు తమ వృత్తిని పరిరక్షించుకునేందుకు ఈనెల 24న నిర్వహించిన సభను ప్రభుత్వం అవమానించిందని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు రాఘవచారి, ప్రధాన కార్యదర్శి వెంకట స్వామి మాట్లాడారు. సుమారు 50 వేల మందితో స్వర్ణకారులు హాజరైన సమావేశానికి రావాలంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిలను ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికీ రాకపోవడం సిగ్గుచేటన్నారు.
- రాష్ట్ర స్వర్ణకార సంఘం డిమాండ్
ఖైరతాబాద్: స్వర్ణకారుల సమస్యలను ప్రభుత్వానికి విన్నవించడంతో పాటు తమ వృత్తిని పరిరక్షించుకునేందుకు ఈనెల 24న నిర్వహించిన సభను ప్రభుత్వం అవమానించిందని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు రాఘవచారి, ప్రధాన కార్యదర్శి వెంకట స్వామి మాట్లాడారు. సుమారు 50 వేల మందితో స్వర్ణకారులు హాజరైన సమావేశానికి రావాలంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిలను ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికీ రాకపోవడం సిగ్గుచేటన్నారు.
ప్రజా పాలన అందిస్తామని లేనిపోని హామీలు గుప్పించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సమాజంలో ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర వెనుకబాటును అనుభవిస్తున్న సామాజిక వర్గ ప్రజల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని మండిపడ్డారు. స్వర్ణకారుల ఓట్లు, మద్దతు అవసరమైనప్పుడు హామీలు ఇచ్చిన వారి సమస్యల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. వారంలోపు ప్రభుత్వం స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

