హైదరాబాద్: హైదరాబాద్లోని లాలాడలో విషాదం చోటుచేసుకున్నది. వాలీబాల్ కోచ్ వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్థిని (Degree Student) ఆత్మహత్య (Suicide) చేసుకున్నది. లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా దేవాలయంలో సమీపంలో నివాసం ఉంటున్న మౌలిక (19) అనే యువతి, తార్నాకలోని రైల్వే డిగ్రీ కాలేజీలో సెకండియర్ చదువుతున్నది. అదే కాలేజీలో అంబాజీ అన్యే వ్యక్తి వాలీబాల్ కోచ్గా పనిచేస్తున్నారు. అయితే కొంతకాలంగా తనను ప్రేమించాలని మౌలికను అంబాజీ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి.. ఉరివేసుకుని బలవన్మరణం చెందింది. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.