బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. మాజీ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో వెంకట్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, భాస్కర్, ప్రవీణ్, ముర ళి, నవీన్, రామకృష్ణతో పాటు వందలాది మం ది నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.
- కాంగ్రెస్, బీజేపీ నుంచి భారీగా వలసలు
- కేసీఆర్ నాయకత్వం మీద అంటున్న నేతలు
మేడ్చల్, మే10 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. మాజీ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో వెంకట్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, భాస్కర్, ప్రవీణ్, ముర ళి, నవీన్, రామకృష్ణతో పాటు వందలాది మం ది నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. కాగా, ఇటివలే జవహర్‌నగర్‌కు చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పీర్జాదిగూడకు చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ మేయ ర్ జక్క వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెంది న కౌడే పోచయ్య, వెల్లంకి శశిధర్‌రెడ్డి, దొంతిరి మధుసూదన్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఒంటేరు మాధవరెడ్డి, సోమిరెడ్డి, విద్యావేత్త ఆకుల మధుకర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం విదితమే. మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఈస్ట్ఆనంద్బాగ్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయలను మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హామీలను నెరవేర్చడంలో విఫలమవుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత, కేసీఆర్ మీద అభిమానం తో ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. కేవలం పార్టీ నుంచే కాకుండా కాలనీల సంక్షేమ సంఘాలు కూడా బీఆర్ఎస్లో చేరుతున్నారు.
టార్టెట్కు మించి సభ్యత్వ నమోదు..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో సత్తా చాటుతామని బీఆర్ఎస్ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ అదిష్టానం సభ్యత్వ నమోదుకు ఇచ్చే టార్గెట్‌కు మించి సభ్యత్వ నమోదు చేస్తామని శ్రేణులు దీమాగా ఉన్నాయి. ఇప్పటికే మల్కాజిగిరి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదుపై డివిజన్ల వారీగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

