హైదరాబాద్ : సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో డెక్కన్ మాల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కూల్చివేత పనుల్లో పెను ప్రమాదం తప్పింది. కూల్చివేత పనులు కొనసాగుతుండగానే.. 5 అంతస్తులు ఒకేసారి కుప్పకూలిపోయాయి. చుట్టుపక్కల ఇండ్లలోని వారిని భవనం కూల్చివేత కంటే ముందే అధికారులు ఖాళీ చేయించారు. భవనం చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
డెక్కన్ మాల్ కూల్చివేత పనులు గురువారం నుంచి కొనసాగుతున్నాయి. చుట్టు పక్కల బిల్డింగ్‌లకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా హైడ్రాలిక్ క్రషర్ డిమాలిషన్ విధానంలో కూల్చివేస్తున్నారు. డైమండ్ కటింగ్‌తో ఒకేసారి భవనం కూప్పకూలకుండా, ఒకవైపు ఒరగకుండా కూల్చివేయడం ఈ యంత్రం ప్రత్యేకత.
తొలుత భవనం చుట్టూ 125 మైక్రాన్ మందంతో ప్లాస్టిక్ షీట్ ఏర్పాటుకు రూ. 26 వేలు, కూల్చివేత సామాగ్రికి దాదాపు రూ. 11 లక్షలు, 20 కిలోమీటర్ల దూరానికి వ్యర్థాల తరలింపునకు రూ. 22 లక్షలు కలిపి మొత్తం రూ.33.86 లక్ష అంచనా టెండర్‌ను పిలవగా, నగరానికి చెందిన రూ. 25. 94 లక్షలకు ఎస్కె మల్లు అనే ఎజెన్సీకి ఈ పనులను అప్పగించారు.
సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో డెక్కన్ మాల్ కూల్చివేత పనులు కొనసాగుతుండగా, ఒక్కసారిగా కుప్పకూలిన భవనం.. pic.twitter.com/CsHIgO4Z83
— Namasthe Telangana (@ntdailyonline) January 31, 2023