శామీర్‌పేట, మే 30: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వర్‌రావు కోరారు. మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రణాళికను రూపొందించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు ఉత్సవాలను సంబురంగా నిర్వహించారు.
అదే విధంగా ఉత్సవాలపై శామీర్‌పేట, మూడుచింతలపల్లి మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మధుసూదన్‌రెడ్డి, సురేశ్, నర్సింగ్రావుగౌడ్, కమిషనర్ జేతూరామ్నాయక్, మేనేజర్ శ్రావణ్‌కుమార్, పర్యావరణ ఇంజినీర్ గణేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఘట్కేసర్,పోచారం మున్సిపాలిటీల్లో..
ఘట్కేసర్,మే30: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను మున్సిపాలిటీల్లో ఘనంగా నిర్వహించాలని కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు.మంగళవారం పోచారం కౌన్సిల్ సమావేశం చైర్మన్ కొండల్‌రెడ్డి, ఘట్కేసర్ సమావేశం చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్య యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ జరుపుకుంటున్న ఈ ఉత్సవాలను మున్సిపాలిటీలలో భారీ ఎత్తున 21 రోజుల పాటు నిర్వహించాలని సభ్యులు నిర్ణయించారు. రోజుకో అంశంతో ఈ ఉత్సవాలను నిర్వహించి ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో కమిషనర్లు ఏ.సురేశ్, వేమన రెడ్డి,కౌన్సిలర్లు,అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో …
మేడ్చల్ కలెక్టరేట్, మే 30: దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు.కలెక్టరేట్లో మంగళవారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై కో-ఆర్డినేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దశాబ్ది ఉత్సవాల ఏర్పా ట్లు పక్కగా ఉండాలని, అవతరణ కార్యక్రమాలు ఘనం గా నిర్వహించాలని అందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి, మహిళలు, పిల్లలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ అధికారి అక్కేశ్వరరావు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.