బొంరాస్పేట్, మార్చి 9 : తండ్రి మందలించడంతో కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మహంతీపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ అబ్దుల్ రాహుఫ్ తెలిపిన వివరాల ప్రకారం బొంరాస్పేట మండల మంహతీపూర్ గ్రామానికి చెందిన అనిత లాలప్ప దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆయన కుమార్తె మమత (15) 10వ తరగతి చదువుతుంది. లాలప్ప తన కొడుకు, కుమార్తెతో కలిసి పొలం దగ్గరకు పొలం పనులకు వెళ్లారు.
అక్కడ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కుమార్తెను నీకు ఏమి పని చేయడానికి రాదని మందలించడంతో కుమార్తె అలిగి ఇంటికి వెళ్లింది. ఇంటి దగ్గర తలుపులకు గడియపెట్టి దూలానికి మమత ఉరివేసుకున్న విషయాన్ని కుమారుడు తండ్రికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. తలుపులు బద్దలుకొట్టి గదిలోకి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను వెం టనే తాండూరుప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించినట్లు ఎస్ఐ తెలిపారు. కుమార్తె మృతిపై ఎలాంటి అనుమానాలులేవని తల్లి అనిత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.