Hyderabad | సుల్తాన్ బజార్, జూన్ 19 : గౌలిగూడలోని హైదరాబాద్-1 డిపో నుండి నడిచే సర్వీసులకి సంబంధించి ప్రయాణికుల సలహాలు, సూచనలు, సమస్యలు స్వీకరించేందుకు ఈనెల 20వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్-1 డిపో మేనేజర్ ఎం వేణు గోపాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాయిచూర్, కర్నూల్, నంద్యాల, బెంగళూరు, సేడం, యాదగిర్, గుల్బర్గా, షోలాపూర్, నాగపూర్ తదితర రూట్లలో తిరిగే బస్సు సర్వీసులకు సంబందించిన ఫిర్యాదులు సలహాలు తెలియజేసేందుకు డయల్ యువర్ డిఎంలో భాగంగా 9959226248 నంబర్‌కి ఫోన్ చేయొచ్చన్నారు.