సిటీబ్యూరో, జూలై 7(నమస్తే తెలంగాణ): ఫోన్‌పే యాప్‌లో సమస్య రావడంతో కస్టమర్ కేర్ సెంటర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తుండగా సైబర్‌నేరగాళ్లు రంగప్రవేశం చేసి కస్టమర్ సెంటర్ ప్రతినిధిగా నమ్మించి డబ్బులు దోచేశారు. బల్కంపేటలో నివసిస్తున్న 60 ఏండ్ల వ్యక్తి ఈనెల 3న తన ఫోన్‌పే యాప్‌లో సమస్య వస్తుండటంతో గూగుల్‌లో ఫోన్‌పే కస్టమర్ కేర్ సెంటర్ నంబర్ కోసం వెతికాడు. ఈ సమయంలోనే బాధితుడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్‌పే సపోర్ట్ టీమ్ నుంచి అంటూ.. బాధితుడిని ఫోన్‌పే అప్లికేషన్‌ను తన ఫోన్లో ఓపెన్ చేయమని చెప్పారు.
అడ్రస్ ధ్రువీకరించుకుని, బ్యాంక్‌ఖాతా వివరాలు చెప్పమని అడిగితే బాధితుడు తన అకౌంట్స్ వివరాలు అతడికి చెప్పాడు. ఆ తర్వాత బాధితుడి బ్యాంక్ ఖాతాల నుంచి చాలాసార్లు అనధికారికంగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించాడు. తన ఖాతాల నుంచి రూ.4,20,000 లక్షలు సైబర్‌నేరగాళ్లు దోచుకున్నట్లు తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారమిచ్చాడు. ఆ తర్వాత సైబర్‌క్రైమ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.