సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్ ఫ్రాడ్‌కు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఒక్క కమిషనరేట్ పరిధిలోనే రోజుకు కోటి, రెండు కోట్లు.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 కోట్ల వరకు కేవలం ట్రేడింగ్‌కు సంబంధించి మోసాలకు పాల్పడుతున్నారు. అయితే మో సపోతున్నవారిలో బాగా చదువుకున్నవారే అధికంగా ఉండడం గమనార్హం. ఒక బ్రోకరేజ్ సంస్థ తరపున డీమాట్ ఖాతా తెరిచి, స్టాక్స్ ట్రేడింగ్ చేస్తున్నారంటే ఒకే ఖాతా నుంచి లావాదేవీలు జరగాలి. కానీ బాగా చదువుకున్న వాళ్లు కనీసం ఈ విషయాన్ని కూడా గుర్తు పట్టడం లేదు.
సైబర్‌నేరగాళ్లు.. తమ సొంత యాప్‌లు, వెబ్సైట్లలో లాగిన్ ఐడీలు ఇచ్చి అందులో నుంచే స్టాక్స్ కొనిపిస్తున్నారు. ఆయా వెబ్సైట్లు, యాప్‌ల్లో నుం చి కాకుండా యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్ ల ద్వారా ఎప్పటికప్పుడు బ్యాంకు ఖాతాలను బాధితులకు పంపిస్తూ ఆయా ఖాతా ల్లో డబ్బులు డిపాజిట్ చేయాలని సూచన లు చేస్తున్నారు. ఇక్కడే బాధితులు ఎందుకు వివిధ ఖాతాలు ఇస్తున్నారని అనుమానించి ఆరా తీస్తే అది మోసమని తేలేది.. కానీ బాధితులు ఎవరు కూడా ఆ పని చేయకుం డా నిండా మునుగుతున్నారు. ఒక్క రోజులోనే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ట్రే డింగ్‌కు సంబంధించి సుమారు 2కోట్ల వర కు సైబర్‌నేరగాళ్ల చేతిలో మోసపోయారు.
బాలాపూర్‌కు చెందిన ఒక రిటైర్డు సైంటి స్ట్ భార్య ఫోన్ నంబర్‌ను అవరిగఫిన్ ఎన్‌ఎన్‌ఎంఎస్116 అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. దాని కి దివ్యశర్మ అనే పేరుతో అడ్మిన్‌గా ఉం టూ ట్రేడింగ్‌లో బాగా సంపాదించవచ్చంటూ సూచనలు చేశారు. బాధితుడు రూ.20వేలతో ట్రేడింగ్ ప్రారంభించడంతో మొదట లాభాలు చూపించారు. వారిపై నమ్మకం కుదరడంతో ఐపీఓలు తక్కువ ధరకు వస్తున్నాయని ఒక్కసారిగా ఇన్ఫోనేటివ్ సొల్యూషన్స్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ను రూ.45లక్షలు వెచ్చించి 1,69,604 షేర్లు తీసుకున్నాడు. వాటిని కొని, అమ్మిన తరువాత రూ.46 లక్షల లాభాలు చూపించారు. తరువాత మరో కంపెనీ షేర్స్ కొనుగోలు చేశాడు.
తన ఖాతాలో స్క్రీన్‌పై రూ.1.35 కోట్ల లాభం కన్పిస్తోంది. వాటిని విత్ డ్రా చేసుకోవాలంటే 20శాతం కమీషన్ చెల్లించాలనే షరతు విధించారు. దానిని కూడా బాధితుడు చెల్లించాడు. మరోసారి 30 శాతం ఇన్‌కంట్యాక్స్ చెల్లించాలంటూ సూచనలు చేయడంతో అందు లో సగం వరకు చెల్లించాడు. అయినా డబ్బులు విత్‌డ్రా చేసుకునే వీలు లేకుం డా పోయింది. ఇలా రూ. 62,02,180 పెట్టుబడి పెట్టి మోసపోయాడు. అయితే ఇవన్నీ 28 లావాదేవీల్లో 28 బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్చేయడం గమనార్హం.
దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన వ్యాపారి కే109 బ్లింక్స్ వెల్త్ గైడెన్స్ వాట్సాప్ గ్రూప్‌లో చేరాడు. ఆ తరువాత అదే పేరుతో ఉన్న ఒక యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని స్టాక్స్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టాడు. మొదట తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టినప్పుడు లాభాలు చూపించారు. 30 శాతం డిస్కౌంట్లో షేర్స్ వస్తున్నాయంటూ నమ్మిస్తూ దఫ దపాలుగా రూ. 55.25 లక్షలు పెట్టుబడి పెట్టించగా..రూ.2 లక్షలు లాభం ఇచ్చి మిగతా రూ. 53లక్షలు కొట్టేశారు. ఇం దులో 12 బ్యాంకు ఖాతాల్లో ఆ డబ్బు ను డిపాజిట్ చేయించారు.
ప్రైవేట్ ఉద్యోగం చేసే సరూర్‌నగర్‌కు చెందిన బాధితుడి వాట్సాప్‌కు హెచ్ఎస్బీసీ ట్రేడింగ్ ఏజెన్సీ పేరుతో వచ్చిన మెసేజ్‌కు స్పందించాడు. హెచ్ఎస్బీసీ పేరున్న సంస్థగా భావించి ఆ గ్రూప్‌లో చెప్పే విషయాలు వింటూ నేరగాళ్లు చూపించిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ట్రేడింగ్ మొదలు పెట్టాడు. దఫ దఫాలుగా రూ.20.72 లక్షలు 13 బ్యాం కు ఖాతాల్లో వెచ్చించి మోసపోయాడు.