హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్, శామీర్పేట, దుండిగల్లో సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో బ్యాంకులకు నగదు తీసుకెళ్లే వాహనాలల్లో సోదాలు చేశారు. దీంతో సరైన క్యూఆర్ కోడ్లు లేకుండా అక్రమంగా డబ్బును తరలిస్తున్నట్లు గుర్తించారు.
రెండు వాహనాల్లో కలిసి మొత్తం రూ.98 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. డబ్బును ఎక్కడికి తరలిస్తున్నారు, ఎవరికోసం తీసుకెళ్తున్నారనే కోణంలో ఆరాతీస్తున్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. రెండు వాహనాలను సీజ్చేశారు.