అండగా ఉండి.. చేయూతనిచ్చి
విధినిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన హోంగార్డు జి.శ్రీనివాస్ కుటుంబానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రూ.11,60,000చెక్కును అందజేశారు.
- విధి నిర్వహణలో హోం గార్డు శ్రీనివాస్ మృతి
- బాధిత కుటుంబానికి 11.60 లక్షల చెక్కు అందజేత
సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): విధినిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన హోంగార్డు జి.శ్రీనివాస్ కుటుంబానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రూ.11,60,000చెక్కును అందజేశారు. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న శ్రీనివాస్ ఈ సంవత్సరం జనవరి 25న కండ్లకోయ జంక్షన్లో విధులు నిర్వర్తిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన విషయం తెలిసిందే. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు సైబరాబాద్‌తో పాటు హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పనిచేసే పోలీసు సిబ్బంది అంతా కలిసి విరాళాల రూపంలో రూ.11లక్షల 60వేలు సమీకరించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో శుక్రవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర జాయింట్ సీపీ(ట్రాఫిక్) నారాయణ్‌నాయక్, మేడ్చల్ జోన్ డీసీపీ సందీప్‌లతో కలిసి హోంగార్డు భార్యాపిల్లలకు అందచేశారు. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీలో శ్రీనివాస్ వేతనానికి సంబంధించిన ఖాతా ఉండటంతో ఇన్సూరెన్స్ కింద రూ.30లక్షలను అదనపు డీజీ అభిలాష బిస్ట్ అందచేశారు. ఈ సందర్భంగా సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ విధినిర్వహణలో మృతిచెందిన హోంగార్డు శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

