ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలి
ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు రాకుండా మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనరేట్‌లో నిర్వహించిన ట్రాఫిక్ రివ్యూ మీటింగ్‌లో సీపీతోపాటు పలువువు అధికారులు పాల్గొన్నారు.
- సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు రాకుండా మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనరేట్‌లో నిర్వహించిన ట్రాఫిక్ రివ్యూ మీటింగ్‌లో సీపీతోపాటు పలువువు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌పై పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా బాటిల్ నెక్ ప్రాంతాలు, ఇరుకుగా ఉండి ట్రాఫిక్‌కు అంతరాయం కల్పించే ప్రధాన జంక్షన్లపై దృష్టిపెట్టి సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఐటీ సెక్టార్లో ట్రాఫిక్ సులభంగా వెళ్లేందుకు వీలుగా జంక్షన్లను మరింత అభివృద్ధి చేయాలన్నారు. రోడ్డు భద్రతపై మరింత అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని, జంక్షన్ల వద్ద యాచకులు లేకుండా బెగ్గర్ ఫ్రీ జంక్షన్ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రధాన జంక్షన్లను అభివృద్ధి చేసి, ట్రాఫిక్ సాఫీగా వెళ్లేవిధంగా చర్యలు తీసుకున్నామని, పలు చోట్ల కొత్త సిగ్నల్స్‌ను సైతం ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా సీపీ తెలిపారు. ఈ సమావేశంలో సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ కె.నారాయణ్ నాయక్, ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు, రోడ్ సేఫ్టీ డీసీపీ ఎల్.ఛత్రియ నాయక్, ట్రాఫిక్ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

