హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించే ఈవెంట్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి (CP Avinash Mahanty) అన్నారు. పర్మిషన్ తీసుకున్న తర్వాతే టికెట్లు విక్రయించాలని స్పష్టం చేశారు. మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ సమీపంలో నిర్వహించ తలపెట్టిన ‘సన్‌బర్న్’ ఈవెంట్‌పై తలెత్తిన వివాదంపై సీపీ స్పందించారు. ఈవెంట్ నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ తాము అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఇది ఇతర నగరాల్లో జరిగే సన్‌బర్న్‌లాంటి వేడుక కాదని, అందుకే పర్మిషన్ నిరాకరించామని తెలిపారు.
కాగా, ఈవెంట్‌కు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ నిర్వాహకులు ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్నారు. దీనిపై బుక్‌మై షో ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. పరిధి దాటితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం.