సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్, పెట్టుబడి మోసాల్లో వేర్వేరు కేసుల్లో లక్షల్లో దోచుకున్న ఆరుగురు సైబర్ నిందితులను అరెస్ట్ చేశారు. వీరందరిపై దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
చెందిన ఓ మహిళను పోలీస్, సీబీఐ ఆఫీసర్ల పేరుతో డిజిటల్ అరెస్ట్ చేసి.. రూ.40,50,000 దోచుకున్న కేసులో కర్ణాటకకు చెందిన సౌరవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ..అతని నుంచి సెల్ఫోన్లు, డెబిట్ కార్డులు, చెక్‌బుక్స్, విజిటింగ్ కార్డ్స్, స్టాంప్స్ స్వాధీనం చేసుకున్నారు. సౌరవ్‌పై తెలంగాణలో రెండు కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు, ఢిల్లీలో ఒకటి, ఉత్తరాఖండ్‌లో ఒక కేసు నమోదయి ఉన్నాయి.
ట్రూప్ బజార్‌కు చెందిన ఓ మహిళను ఫేక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో పెట్టుబడులు పెట్టించి రూ.3.79లక్షలు కొట్టేసిన కేసులో బి.సాయినాథ్‌రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సాయినాథ్‌రెడ్డి అకౌంట్ సఫ్లయిర్, ఫెసిలిటేటర్‌గా కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయడంతో పాటు బాధితురాలు ఫండ్స్ పంపగానే వాటిని వేరే ఖాతాల్లోకి మరల్చడంలో కీలకపాత్ర పోషించినట్లుగా పోలీసులు తెలిపారు. ఇతనిపై దేశవ్యాప్తంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, వెస్ట్బెంగాల్లలో 11 కేసులు నమోదయ్యాయని, ఇతని నుంచి బ్యాంక్కిట్స్, క్యూఆర్‌కోడ్ స్కానర్స్, షెల్‌కంపెనీ స్టాంప్స్, తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
చెందిన బాధితుడిని ఫేస్బుక్లో కాంటాక్ట్ చేసి అధికలాభాలు వస్తాయంటూ ఆశపెట్టి ఫేక్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి.. రూ.1,98,25,000 కొట్టేసిన కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అమన్పాల్సింగ్ను సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అమన్ .. యూపీ, న్యూఢిల్లీలలో తన ఏజెంట్ల ద్వారా కరెంట్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి.. వాటిని పెట్టుబడుల మోసాల్లో వాడేలా చేస్తాడని పోలీసులు తెలిపారు.
చెందిన ఓవ్యక్తికి గతనెల 30న పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ కొందరు చెప్పగా.. ఆ మాటలు నమ్మి వారి చేతిలో మోసపోయానని బాధితుడు హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రేడింగ్‌లో పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు బాధితుడితో రూ.44,04,753లు పెట్టుబడి పెట్టించి మోసం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నా రు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ముంబైకి చెందిన మిలింద్మనోహర్ నర్కర్, భీవండికి చెందిన రనక్ జగదీశ్పటేల్, ముంబ్రాకు చెందిన సలిక్ ఇంతియాజ్ అహ్మద్ సిద్ధిఖీలను అరెస్ట్ చేశారు.