ట్రాన్స్‌పోర్టు వ్యాపారం పేరుతో కోట్లాది రూపాయల టోకరా
ట్రాన్స్‌పోర్టు వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తి పలువురి వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసి ఉడాయించాడు. ఈ ఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది.
- పోలీసులను ఆశ్రయించిన బాధితులు
ఖైరతాబాద్, జూన్ 12 : ట్రాన్స్‌పోర్టు వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తి పలువురి వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసి ఉడాయించాడు. ఈ ఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం…దిల్సుఖ్నగర్ చైతన్యపురికి చెందిన కోటకొండ నంద కిశోర్ పంజాగుట్టలోని ఓ డయాగ్నస్టిక్ సంస్థలో పనిచేస్తున్నాడు. అదే సంస్థలో పనిచేస్తున్న పల్లి యోగేశ్వర రావుతో ఎనిమిదేండ్లుగా పరిచయం ఉంది.
ఆ పరిచయాన్ని ఆసరా చేసుకొని మే 2021లో ఓ హోటల్‌కు పిలిపించి ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేయడం ద్వారా అత్యధిక లాభాలు గడించవచ్చని, రవాణా వాహనాలు, బస్సుల ద్వారా తాను ఈ వ్యాపారంలో మంచి లాభాలు పొందుతున్నానని, వ్యాపార భాగస్వామ్యం కల్పిస్తానని యోగేశ్వర రావు తన సహద్యోగి నంద కిశోర్‌ను నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి రూ.15లక్షల పెట్టుబడి పెట్టాడు.
నందకిశోర్‌తో పాటు అతని స్నేహితులతో కూడా పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపించగా, 2021 నుంచి 2025 వరకు ఒక్కొక్కరు లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టారు. నందకిశోర్ రెండో సారి పలు విడతల్లో రూ.75లక్షల వరకు అతను సూచించిన బ్యాంకు ఖాతాలకు డబ్బులను పంపించాడు. మొదట్లో పెట్టుబడుల్లో రాబడుల పేరుతో కొంత కాలం డబ్బులు చెల్లించిన యోగేశ్వర రావు వ్యాపారంలో లాభాలు వస్తున్నాయన్న నమ్మకం కలిగించాడు.
2025 డిసెంబర్ తర్వాత డబ్బులు రావడం నిలిచిపోవడంతో పాటు యోగేశ్వరరావు ముఖం చాటేశాడు. అతనితో పాటు భార్య ప్రత్యూష సైతం ఈ మోసంలో భాగస్వామిగా ఉందని, యోగేశ్వర రావు సోదరి దీపిక, ఆమె భర్త పగోటి శ్రీనివాస్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్‌లో ఉన్నారని, వారి వద్ద కీలక సమాచారం ఉండి ఉంటుందని బాధితులు పోలీసులకు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

