సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని సీపీ అంజనీకుమార్ అన్నారు. నవరాత్రులు, గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని శాఖల అధికారులతో పాటు భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితితో కలిసి గురువారం కమిషనరేట్ కార్యాలయంలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్‌తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ గణేశ్ నవరాత్రులకు చేస్తున్న ఏర్పాట్లు, బందోబస్తుపై వివరించారు.