బన్సీలాల్‌పేట/అమీర్‌పేట, ఆగస్టు 15: ఫుట్‌పాత్‌లపై భిక్షాటన చేస్తూ అనాథలుగా జీవనం సాగిస్తున్న వారికి ఆదివారం కొవిడ్ వ్యాక్సినేషన్ జరిగింది. ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేని ఇటువంటి వారికి ప్రభుత్వం ప్రత్యేక కేటగిరి కింద పరిగణిస్తూ వ్యాక్సిన్ అందిస్తున్నది. లోయర్ ట్యాంక్‌బండ్ గోశాల ఫుట్‌పాత్‌లు, రాణిగంజ్ అంబేద్కర్‌నగర్ ఫుట్‌పాత్‌లపై నివాసాలు ఏర్పర్చుకున్న దాదాపు 40 మందికి నగరానికి చెందిన స్కై ఫౌండేషన్ ప్రతినిధుల చొరవతో ఆదివారం వ్యాక్సినేషన్ అందింది. అనాథలుగా గుర్తించిన వారి పేర్లు, ఫొటోలు సేకరించి వ్యాక్సిన్ అందిస్తున్నారు. సమాజంలో నిరాదరణకు గురవుతున్న ఇటువంటి వారిని గుర్తించి ప్రభుత్వం ద్వారా అందుతున్న వ్యాక్సిన్‌ను ఇప్పించేందుకు స్కై ఫౌండేషన్ వ్యవస్థ్ధాపక అధ్యక్షుడు వై.సంజీవ్కమార్ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆదివారం వ్యాక్సినేషన్ సిబ్బందితో కలిసి లోయర్ ట్యాంక్‌బండ్ గోశాల, అంబేద్కర్‌నగర్ ఫుట్‌పాత్ పరిసరాలను సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు వై.సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ ఇకపై సంస్థ ద్వారా అనాథలకు అన్నదానం, బట్టల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు జరిగే ఆదివారాల్లో వ్యాక్సినేషన్‌కు దూరమైన వారిని గుర్తించి వారికి వ్యాక్సినేషన్ జరిగేలా చొరవ తీసుకుంటామని తెలిపారు.