హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ వేసుకోకున్నా.. వేసుకున్నట్టుగా చూపిస్తూ అచ్చం ఒరిజినల్ సర్టిఫికెట్ను పోలిన కోవిడ్ నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని పాతబస్తీలో కోవిడ్ సర్టిఫికెట్లను ఓ ముఠా విక్రయిస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న కాలాపత్తర్ పోలీసులు వెంటనే దాడి చేసి ముఠాను పట్టుకున్నారు. నిందితుల నుంచి కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్లు, 4 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.