గ్రీనరీ మాటున లూటీ.. హెచ్ఎండీఏ ఖజానా దోపిడీకి సీఎంవో లెవెల్లో పైరవీలు
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టాల్సిన గ్రీనరీ, ల్యాండ్ సేపింగ్ పనులు పెద్దఎత్తున అవినీతికి నిలయంగా మారుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా అత్యంత పారదర్శకంగా సాగిన పచ్చదనం పనులను..
- పచ్చదనం పనుల్లో ఇష్టారాజ్యం.. ప్రజాధనం గల్లంతు
- అనుభవం లేని బినామీలకు కాంట్రాక్టులు
సిటీబ్యూరో, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టాల్సిన గ్రీనరీ, ల్యాండ్ సేపింగ్ పనులు పెద్దఎత్తున అవినీతికి నిలయంగా మారుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా అత్యంత పారదర్శకంగా సాగిన పచ్చదనం పనులను.. మూడేండ్లుగా కొందరు అక్రమారులు దోపిడీ సాధనంగా మార్చుకున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం పేరు చెప్పుకొంటూ ఈ అక్రమ పైరవీలకు తెరలేపారు. అందినకాడికి కాంట్రాక్టులను కొట్టేస్తూ ప్రజాధనం లూటీ చేస్తున్నారు.
సీఎంవో పేరుతో అనధికార కేటాయింపులు
సీఎంవో పేరుతో అనధికార కేటాయింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. టెండర్లలో భారీ సెటిల్మెంట్లు హెచ్ఎండీఏలో నిబంధనలను తప్పకుండా పాటించాల్సిన అధికారులే కొందరు తెరవెనుక చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా టెండర్లు పిలిచినప్పటికీ, సీఎం కార్యాలయం నుంచి సిఫార్సులు ఉన్నాయంటూ కొందరు బరితెగించి కాంట్రాక్టర్లతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. పనులు కేటాయించినందుకు కాంట్రాక్ట్ విలువలో భారీ మొత్తాన్ని ముడుపుల రూపంలో డిమాండ్ చేసి వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం స్థానికంగానే కాకుండా, ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు రాజకీయ నాయకులు, వారి డ్రైవర్లు, వ్యక్తిగత సిబ్బంది కూడా ఈ పైరవీల పర్వంలో చక్రం తిప్పుతుండటం విశేషం.
అనుభవానికి తిలోదకాలు..
హార్టికల్చర్, ల్యాండ్ సేపింగ్ రంగంలో కనీస అవగాహన, అనుభవం లేని వ్యక్తులను ఎంపిక చేసి మరీ పనులు కట్టబెడుతున్నారు. ఈ రంగంలో సుమారు మూడు దశాబ్దాలుగా అనుభవం ఉండి, నాణ్యతా ప్రమాణాలతో పనిచేస్తున్న అసలైన కాంట్రాక్టర్లను పకన పెడుతున్నారు. కనీస అర్హత లేని ఏజెన్సీలు రంగంలోకి దిగడంతో ప్రొఫెషనల్ ల్యాండ్ సేపింగ్ ప్రమాణాలు గాలికి కొట్టుకుపోతున్నాయి. ఫలితంగా కోట్లు వెచ్చించి పెంచుతున్న మొకల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అదనపు బిల్లుల మాయాజాలం ఎకడో కాగితాలపై తయారైన లెకలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు ఎకడా పొంతన లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు నేలమీద పనే జరగకపోయినా, నాసిరకంగా చేసినా, రికార్డుల్లో మాత్రం భారీగా బిల్లులు సృష్టించి చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ అక్రమ తంతుపై ఏదైనా స్వతంత్ర సంస్థతో క్షేత్రస్థాయి పరిశీలన, కొలతలు, నాణ్యతా పరీక్షలు జరిపిస్తేనే ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టం బట్టబయలవుతుంది.
పైరవీకారులు నేరుగా..
ఈ అక్రమాలను అడ్డుకోవాలని, నిబంధనల ప్రకారం బిల్లులు చెల్లించాలని చూసే నిజాయితీ గల హెచ్ఎండీఏ అధికారులపై తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయి. పైరవీకారులు నేరుగా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అధికారులను బెదిరిస్తున్నట్లు సమాచారం. ఈ విచ్చలవిడి విధానాల వల్ల ప్రభుత్వధనం దుర్వినియోగం కావడమే కాకుండా, పచ్చని భాగ్యనగరాన్ని తీర్చిదిద్దాలనే ప్రధాన లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపిస్తేనే అసలు దోషులు ఎవరో తేలే అవకాశం ఉంది.
అక్రమాలపై కమిషనర్ గప్‌చుప్
పూర్తి స్థాయి కమిషనర్ నియామకం తర్వాత హెచ్ఎండీఏలో పారదర్శకత పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ బాధ్యతలు చేపట్టి రెండేండ్లు గడుస్తున్నా… అక్రమ బాగోతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. గతంలో గ్రీనరీ పేరిట వచ్చే కోట్ల రూపాయలపై కన్నేసిన కొందరు అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు… అయిన వారికి టెండర్లు లేకుండా పనులను కట్టబెడుతున్నారు. దీనిపై యథేచ్ఛగా జరుగుతున్న అక్రమాలు బయటకు రావడంతో..మళ్లీ యథావిధి టెండర్లు పూర్తి చేశారు. తాజాగా అర్బన్ ఫారెస్ట్రీలోనూ ఇదే తరహాలో టెండర్ల గోల్మాల్ చేస్తూ, పాలిథీన్ సంచుల నుంచి మొక్కల పెంచే నర్సరీల వరకు అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నా… కనీసం హెచ్ఎండీఏ కమిషనర్ దృష్టి పెట్టడం లేదు. దీనిపై ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది ఇప్పుడు హెచ్ఎండీఏలో చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

