బాలానగర్, అక్టోబర్ 14 : కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని ఓల్డ్‌బోయిన్‌పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ అన్నారు. బుధవారం జూబ్లిహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ ఎన్నికల ఇన్చార్జి కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో భాగంగా నేతాజీనగర్, నటరాజ్‌నగర్, సుల్తాన్‌నగర్, సౌత్ శంకర్లాల్నగర్లలో ఓల్డ్‌బోయిన్‌పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా పలు వ్యాపార సముదాయాలకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి మాగంటి సునీతను గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో ఎర్రగడ్డ డివిజన్ బీఆర్ఎస్ నేతలు, షరీఫ్, జావిద్, అజీమ్, సల్మాన్, కర్రె జంగయ్య, సయ్యద్ ఎజాజ్, ఇర్ఫాన్, హరినాథ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని ఐదు బూతుల నేతలు, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో సిద్దిపేట నుంచి ప్రచారానికి వచ్చిన సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సింహ తన బృందంతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలంతా కలిసి ఇంటింటికీ తిరుగుతూ మాగంటి సునీత గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించారు.
Hyd5