మియాపూర్ : నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో సౌకర్యవంతమైన రహదారుల నిర్మాణమే లక్ష్యంగా పనులను చేపడుతున్నట్లు, మెరుగైన రవాణా వసతి కోసం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. బస్తీ , కాలనీ ఏదైనా పూర్తి స్థాయి వసతులను కల్పించటమే నియోజకవర్గ ప్రతినిధిగా తన లక్ష్యమన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి డివిజన్ పరిధిలోని దీనబంధు, ప్రగతినగర్, ఆస్బెస్టాస్ కాలనీ, పాపిరెడ్డి నగర్, పాపారాయు డు కాలనీల్లో రూ. కోటితో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాసరావులతో కలిసి విప్ గాంధీ శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజవకర్గంలో ఇప్పటికే యూజీడీ పనులను పూర్తి చేసిన కాలనీల్లో పక్కా రహదారుల నిర్మాణం విస్తృతంగా కొనసాగుతున్నాయన్నారు. కాలనీల్లో సీసీ దారులు, డైనేజీ, తాగునీరు, మెరుగైన విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పించే ప్రాధాన్యతతో ముందుకు సాగుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్,పెద్ద భాస్కర్, చంద్రకాంత్‌రావు, చంద్రారెడ్డి, నాగేశ్వర్రావు, ఇబ్రహీం,ఎల్లం నాయుడు, శ్రీధర్‌రెడ్డి,అబ్బులు, ఖయ్యూం, ప్రసాద్, శెట్టి, అంజి, సత్తయ్య, విఠల్, తిరుపతి, మహేశ్, ఎర్రన్న ,భాస్కర్, పద్మశ్రీ, జ్యోతి, సువర్ణ, కవిత, లావణ్య తదితరులు పాల్గొన్నారు.