ట్కేసర్,సెప్టెంబర్7: ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి.కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇన్ని రోజులు ముందుకు సాగని పనులు మంత్రి మల్లారెడ్డి, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో నిర్మాణ పనులు వేరే నిర్మాణ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. మంత్రి మల్లారెడ్డి ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను ఇటీవల పునఃప్రారంభించడంతో ప్రస్తుతం పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. రూ.39కోట్లలను ప్రభు త్వం బ్రిడ్జి నిర్మాణ పనులకు కేటాయించింది.పనులకు ఎలాంటి అడ్డంకులు లేకుం డా ఉంటే 6నెలలో పూర్తి అయ్యే అవకాశం ఉందని ఆర్అండ్బీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నిర్మా ణ పనులు మేడ్చ ల్ వైపు కొనసాగుతున్నాయి. అనంతరం మరోవైపు పనులను చేపడుతారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయితే ఘట్కేసర్లోని బాలాజీ నగర్,వీకర్సెక్షన్ కాలనీ, గాంధీనగర్,కొండాపూర్ ప్రాంతాలతో పాటు, కీసర,శామీర్పేట్, మేడ్చల్ ప్రాంతాల ప్రజలకు,వాహన దారులకు వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా వెళ్లే అకాశం ఏర్పడుతుంది.
మంత్రి మల్లారెడ్డి చొరవతోనే..
మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రత్యేక చొరవ చూపి, కాంట్రాక్టర్ను మార్పుచేసి మరో సంస్థకు కాంట్రాక్టు అప్పగించడంతో పనులు చకచకా కొనసాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణం సందర్భంగా స్థలాలను కోల్పోయిన బాధితులను ఆదుకుంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యితే ఘట్కేసర్ ప్రజలకు పెద్ద సమస్య పరిష్కారమైనట్లు అవుతుంది.
– పావనీ జంగయ్య యాదవ్, ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్
దీర్ఘకాల సమస్య పరిష్కారం అవుతుంది..
ఎంతో కాలంగా ఎదురు చుస్తున్న ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యితే ఘట్కేసర్ వా సులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది. ఘట్కేసర్ సగభా గం ఇక్కడ,మరోవైపు సగ భాగం ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుం ది.బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు,నాయకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి.
-ఎస్.శ్రీనివాస్ గౌడ్,ఘట్కేసర్ నివాసి.