Football Court | సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కొత్త మైదానాలను ఏర్పాటు చేయాలని బల్దియా నిర్ణయించింది. ఇందులోభాగంగానే గ్రేటర్లో భారీ స్థాయిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఫుట్‌బాల్ కోర్టును ఏర్పాటు చేయనున్నది.
ఐదెకరాల్లో రూ. 200కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ఫుట్‌బాల్ కోర్టు కోసం అధికారులు ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్-తిరుమలగిరి, కూకట్పల్లి, ఖైరతాబాద్-షేక్‌పేట, శేరిలింగంపల్లి-గచ్చిబౌలి ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. త్వరలో అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.