వనస్థలిపురం: ఎల్బీనగర్ నియోజకవర్గం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీలో కమ్యూనిటీ హాల్‌ను కార్పొరేటర్ వెంకటేశ్వరరెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామని, దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, ఎఫ్‌సీఐ కాలనీ అధ్యక్షుడు బాల్‌రెడ్డి, శ్రీధర్‌గౌడ్, సంజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.