గోల్నాక, నవంబర్ 24: కానిస్టేబుల్ చేతిలోని గన్ మిస్‌ఫైర్ అయిన ఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట పోలీస్ లైన్ సీపీఎల్ హెడ్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ గోవర్ధన్‌రెడ్డి ఆదివారం సెంట్రీగా విధులు నిర్వహించాడు. విధులు ముగించుకునే క్రమంలో అర్ధరాత్రి 12.30 సమయంలో అతని చేతిలోని ఎస్ఎల్ఆర్ గన్ ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ కావడంతో అతని భుజానికి గాయాలయ్యాయి. వెంటనే తోటి సిబ్బంది చికిత్ప నిమిత్తం నాంపల్లిలోని కేర్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తున్నది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.