రామంతపూర్ ,మార్చి 26 : రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రామంతాపూర్ నెహ్రు నగర్ నివాసితులైన కానిస్టేబుల్ పాండు (కానిస్టేబుల్), సక్కు భాయ్ (రెవిన్యూ ఉద్యోగి ) దంపతులు మరణించారు.ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్ అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో లారీ స్కూటీ పైకి దూసుకెళ్లింది.
దీంతో స్కూటీ మీద ప్రయాణిస్తున్న దంపతులలో భార్య సక్కుబాయి (36) అక్కడి కక్కడే మృతి చెందగా భర్త పాండు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో కన్ను ముశాడు.కాగా వారి స్వగ్రామమైన కొందూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.