మేడ్చల్, జూ న్ 28 (నమస్తే తెలంగాణ): సన్న వడ్ల బోనస్ డబ్బుల కోసం రైతులు ఎదురు చూడాల్సి వస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని రైతులకు రూ. 1.62 కోట్ల బోనస్ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్లు పూర్తయినా బోనస్ డబ్బులను రైతులకు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. సన్న వడ్లకు కొనుగోలు చేసిన తర్వాత వడ్ల నగదుతో పాటు రూ. 500 బోనస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. అమలుకు నో చుకోవడం లేదు.
జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో 3253.080 మెట్రిక్ టన్నులు సన్న వడ్లను ప్రభు త్వం కొనుగోలు చేసింది. బోనస్ డబ్బులను తక్షణమే అందించకపోతే ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. రైతులకు మోసం చేయడంలో కాంగ్రెస్ ప్రభు త్వం నెంబర్‌వన్‌లో ఉంటుందని రైతులు ఆరోపిస్తున్నారు. అన్నదాతలకు అందించే పథకాలపై అన్నింటికీ ఎదురు చూడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనిపిస్తున్నదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
బోనస్ డబ్బులను తక్షణమే చెల్లించే చర్యలు తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని రైతులు పేర్కొంటున్నారు. బోనస్ డబ్బులుపై అధికారుల చుట్టూ తిరిగినా..వారు తమకు బోనస్ డబ్బులపై ఎలాంటి సమాచారం లేదని రైతులను తిప్పి పంపుతున్నారు.
రైతులకు పథకాలు అందలంటే ఆందోళనలు చేస్తేనే పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని రైతులకు రైతు భరోసా అందించకుంటే ఇటీవలే కలెక్టరేట్‌ను రైతులతో కలిసి ముట్టడిస్తే తప్ప.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను అందించలేదు. అన్ని పథకాల కోసం రైతులు ఎదురు చూడాల్సి వస్తున్నది. రైతులను ఇబ్బందులు పెట్టే ప్రభుత్వానికి అన్నదాతల ఉసురు తాకుతుంది.
-డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి