Tissue culture Lab : జీడిమెట్లలో టిష్యూ కల్చర్ ల్యాబ్ పనులకు శంకుస్థాపన
Tissue culture Lab : నగర శివారులోని జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సమీపంలో టిష్యూ కల్చర్ ల్యాబ్ నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన...

హైదరాబాద్ : (Tissue culture Lab) నగర శివారులోని జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సమీపంలో టిష్యూ కల్చర్ ల్యాబ్ నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఈ ల్యాబ్ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ టిష్యూ కల్చర్ ల్యాబ్‌ను రూ.4.2 కోట్లతో నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ప్రభుత్వరంగంలో ఏర్పాటుచేయనున్న టిష్యూ కల్చర్ ల్యాబ్ ఇదే మొదటిది కావడం విశేషం.
ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయంలో పరిశోధనా ఫలితాలు వేగంగా రైతులకు అందాలని సూచించారు. గొప్ప మార్పునకు ఈ రోజు శ్రీకారం మొదలయిందని చెప్పారు. 9 నెలలలోపు మౌలిక సదుపాయాల ఏర్పాటు పూర్తవుతుందని, సాధ్యమైతే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు చెప్పారు. ఈ ల్యాబ్ వ్యవసాయరంగంలో సాంకేతికంగా తెలంగాణ ఖ్యాతిని పెంచుతుందని అన్నారు. టిష్యూ కల్చర్ మొక్కలకు మార్కెట్లో డిమాండ్ వేగంగా పెరుగుతుందని తెలిపారు. భవిష్యత్‌లో ఇక్కడి నుంచే హరితహారం మొక్కలను అన్ని జిల్లాలకు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. గంధం, టేకు మొక్కలు అటవీశాఖ ద్వారా రైతులకు అందించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. సాంప్రదాయ మొక్కలతో పోలిస్తే టిష్యూ కల్చర్ ద్వారా పెరిగిన మొక్కలు శక్తివంతమైనవే కాకుండా వేగంగా పెరగడంతో పాటు నాణ్యంగా ఉంటాయని చెప్పారు. వ్యాధుల బారిన పడకపోగా మంచి దిగుబడి అందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మి , విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు హాజరయ్యారు.
మొక్కల పెంపకం, ఉత్పత్తి, పునరుత్పత్తిలో టిష్యూ కల్చర్ ల్యాబ్ విప్లవం సృష్టించనున్నది. విత్తన, పండ్ల, ఔషధ, సుగంధ ద్రవ్య, అటవీ, అలంకరణ వంటి అన్ని రకాల మొక్కల టిష్యూ కల్చర్ ద్వారా మేలు రకం జాతుల ఉత్పత్తి ఇక్కడ చేపట్టనున్నారు. అన్ని రకాల మొక్కల ఉత్పత్తికి ప్రాథమిక, మూల ఉత్పత్తిగా ఈ ల్యాబ్ ఉపయోగపడనున్నది.
ఇవి కూడా చదవండి..
ఇమ్రాన్‌ఖాన్-బజ్వా మధ్య పెరుగుతున్న దూరం.. కారణమేంటంటే..?
పిల్లల్ని అతిగా పొగడకండి.. ఎందుకో తెలిపిన బ్రిటన్ అధ్యయనం
సైకిళ్ల శ్మశానం.. ఎక్కడున్నదంటే..?!
లఖింపూర్ ఖేరీలో రైతు స్మారకం.. ఐదుగురు మృతుల విగ్రహాల ఏర్పాటు
బేబీ షవర్ ఫంక్షన్ జరుపుకున్న ఫ్రీదా పింటో
ట్రంప్‌కు సౌదీ రాజు ఇచ్చినవి నకిలీ బహుమతులంట.. దర్యాప్తులో బట్టబయలు
ముచ్చటగా మూడోసారి ప్రధానిగా వాజపేయి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

