ఇంకా ఫైనల్ కాకుండానే ప్రభుత్వం రోడ్డు ఏర్పా టు కోసం టెండర్లకు శ్రీకారం చుట్టింది. దీంతో బాధి త రైతులు ఇదేమి లెక్క అంటూ సర్కారు తీరుపై ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. తమకు భూమికి భూమి లే దా.. మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని ..లేకుంటే భూములు ఇచ్చేది లేదని బాధిత గ్రామాల రైతులు తేల్చి చెబుతున్నారు.
Green Field Road | రంగారెడ్డి, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): రేవంత్ సర్కార్ ఫ్యూచర్‌సిటీ కోసం కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి ఫ్యూచర్‌సిటీ వరకు 300 అడుగుల వెడల్పుతో రేడియల్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టగా.. భూములు కోల్పోనున్న బాధిత రైతులు రోడ్డు సర్వే పనులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయినప్పటికీ పోలీసుల పహారా మధ్య సర్వే పనులను పూర్తి కానిచ్చారు అధికారులు. మొదటి దశ లో కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి మీర్ఖాన్పేట వరకు 18 కిలోమీటర్ల మేర రోడ్డు వేస్తున్నారు. రెండో దశలో మీర్ఖాన్పేట ఫ్యూచర్‌సిటీ నుంచి ఆకుతోటపల్లి ఆర్ఆర్ఆర్ వరకు 22 కిలోమీటర్ల మేర రహదారి వేయనున్నారు. ఇందుకోసం 1,004 ఎకరాల భూ మిని, సుమారు 4,725 మంది రైతుల నుం చి బలవంతంగా సేకరిస్తున్నారు. మొదటి, రెండో విడత రోడ్లను సుమారు 14 గ్రామాల మీదుగా కొంగరకలాన్ నుంచి ఇబ్రహీంప ట్నం, మహేశ్వరం, కందుకూరు, యాచా రం, ఆమనగల్లు మండలాల్లోని గ్రామా ల నుంచి వేస్తున్నారు. రోడ్డు వేయడం తో అర ఎకరం, ఎకరం, రెండు ఎకరాల భూములను కోల్పోతున్నామని.. ఎట్టి పరిస్థితిలోనూ తమ భూములను ఇచ్చేది లేదని రైతులు ఆందోళనబాట పట్టారు. అయినా ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నది.
పరిహారం తేల్చకుండానే టెండర్లు..
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏర్పాటుతో వేలాది మంది రైతులు తమ భూములను కోల్పోతున్నారు. వారికి పరిహారం ఎంతిస్తామనేది తేల్చకుండానే సర్కారు టెండర్లు పిలవడంపై బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముం దుగా రైతులు భూమికి బదులుగా భూమి ఇవ్వాలని, లేని పక్షంలో మార్కెట్ ధర ప్రకా రం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చిన అధికారులు.. దీనిపై ఏమి తేల్చకుండానే టెండర్లు పిలవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏర్పాటు చేయనున్న కొంగరకలాన్, రావిల్యాల, కందుకూరు, ఫిరోజ్‌గూడ, కొంగరకుర్దు, లేమూర్, తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లి, పంజాగూడ, మీర్ఖాన్పేట తదితర గ్రామాల్లో భూముల ధరలు రూ.కోట్లల్లో పలుకుతున్నాయి.
ముఖ్యంగా కొంగరకలాన్, రావిర్యాల, కందుకూరు మండలాల్లో ఎకరాకు సగటున రూ. కోటి నుంచి రూ.3 కోట్ల వరకు డిమాండ్ ఉన్నది. ప్రభుత్వం మాత్రం మార్కెట్ ధరకు రెండు లేదా మూడింతలు అధికంగా ఇస్తామ ని చెబుతున్నది. కాగా మార్కెట్ ధర రూ. పది నుంచి రూ. పదిహేను లక్షల వరకే ఉన్నది. దీంతో మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇస్తే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పరిహారం విషయాన్ని ఎటూ తేల్చడంలేదు.
నేటి నుంచి టెండర్లు..
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏర్పాటుకు నేటి నుంచి టెండర్లకోసం హెచ్ఎండీఏ అధికారులు దరఖాస్తులు కోరుతున్నారు. మార్చి 21 వరకు దరఖాస్తులను స్వీకరించి 21 తర్వాత బిడ్లను ఓపెన్ చేయనున్నట్లు సమాచారం. ఫేస్-1లో ఓఆర్ఆర్ నుంచి మీర్ఖాన్పేట వరకు 19 కిలోమీటర్లు, ఫేస్-2లో మీర్ఖాన్పేట నుంచి ఆమనగల్లు ట్రిఫుల్‌ఆర్ వరకు టెండర్లు కోరుతున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 2,365 కోట్లుగా అధికారులు ప్రకటించారు.
భూమికి భూమి ఇవ్వాల్సిందే..
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏర్పాటుతో భూములు కోల్పోనున్న బాధిత రైతులు భూమికి భూమి లేదా మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పరిహారం విషయాన్ని ఇంకా తేల్చకుండానే.. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఎలా టెండర్లు పిలుస్తారని మండిపడుతున్నారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏర్పాటుతో భూములు కోల్పోనున్న రైతుల్లో అత్యధికంగా సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని.. ఉన్న అర ఎక రం, ఎకరం, రెండు ఎకరాల భూములను రోడ్డు నిర్మాణానికి తీసుకుంటే తాము ఎలా బతకాలని.. భూమికి భూమి ఇస్తే మరోచోట భూములను కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుని జీవిస్తామని పేర్కొంటున్నారు. పరిహారం తేల్చకుండానే టెండర్లు పిలవడంపై బాధిత గ్రామాల్లో అలజడి మొదలైంది.
రైతులతో చర్చించి పరిహారాన్ని నిర్ణయిస్తాం..
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏర్పాటుతో భూములు కోల్పోనున్న రైతులను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైనది. ఎంత మంది రైతుల నుంచి ఎన్నిక ఎకరాల భూములు పోతున్నాయనేది సర్వే ఆధారంగా నిర్ధారిస్తాం. ఇప్పటికే రైతులతో సమావేశాలు నిర్వహించి వారిని ఒప్పించే ప్రయత్నం చేశాం. త్వరలోనే మరోమారు రైతులతో చర్చించి పరిహారాన్ని నిర్ణయిస్తాం. రైతుల డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. వారికి న్యాయం జరిగేలా చూస్తాం. రైతులకు త్వరలోనే నోటీసులు ఇస్తాం.
-రాజు, భూసేకరణ ప్రత్యేకాధికారి