ఒక వైపు బస్సు రాక కోసం పడిగాపులు కాస్తుండగా, మరోవైపు భానుడి భగభగలు వెంబడిస్తున్నాయి. ఎంత చికాకు పడినా.. చిర్రెత్తినా.. వెయిట్ చేయాల్సిందే..! బస్సు రాదు.. ఎండ తగ్గదు… రాని బస్సుల కోసం వేచి ఉండక తప్పదు. సాధారణ ప్రజలకు బస్సే ప్రధాన ప్రయాణ సాధనం. వీరి పరిస్థితి పాలకులకు పట్టదు. ఎండకు ఎండుతూనే ఆ బస్సు కోసం పడిగాపులు కాయాల్సిందే.
లేదంటే.. ఇలా ఓ చెట్టు నీడన సేద తీరాలి. తార్నాక నుంచి ఉప్పల్ వైపు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం ఇది. ఈ దారిన పలు డిపోలకు చెందిన వందలాది బస్సులు రోజూ నడుస్తాయి. అయినా, ఆదివారం ఇటుగా ఒక్క బస్సు రాకపోవడంతో పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తార్నాకలోని ఆరాధన సినిమా థియేటర్ ఎదురుగా ఉన్న బస్టాప్‌లో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ప్రయాణికుల ఇబ్బందులు పాలకులకు పట్టేనా..!!