మేడ్చల్, జూన్ 26 : తహసీల్దార్ పేరుతో డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని సోమరం గ్రామంలో గంగాస్థాన్ పేరుతో బీఎల్రెడ్డి వెంచర్ చేస్తున్నాడు. మండల పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన మహేందర్‌రెడ్డి ఆ వెంచర్ వద్దకు వెళ్లి తహసీల్దార్ కార్యాలయం నుంచి వచ్చానని, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశా డు. దీంతో బీఎల్ రెడ్డి మహేందర్ రెడ్డికి రూ.2 లక్షలు చెక్ రూపంలో ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ వెంచర్ వద్దకు వెళ్లి, పైస్థాయి అధికారులకు ఇవ్వాలంటూ రూ.3 కోట్లు డిమాండ్ చేశాడు. దీంతో వెంచర్ యజమాని తహసీల్దార్ శైలజను కలిసి జరిగిన విషయాన్ని వివరించాడు. దీంతో ఆమె మహేందర్‌రెడ్డికి తహసీల్దార్ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం పేరుతో డబ్బులు వసూలు చేసిన మహేందర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మహేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.