– కేబీఆర్ పార్కువద్ద ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
బంజారాహిల్స్,మే 1: డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పలితాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘వీ యునైటెడ్ అగైనిస్ట్ డ్రగ్స్’ పేరుతో శ్లోకా ఫౌండేషన్ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ మహమ్మారి భారినపడితే భవిష్యత్తు అంధకారంగా మారుతుందని పేర్కొన్నారు. తమ పిల్లల కదలికలపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలని సూచించారు. ప్రభుత్వం డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపేందుకు కఠినచర్యలు తీసుకుంటోందన్నారు.
ఈ కార్యక్రమంలో శాట్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు వాకర్లు తాము డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటంలో పాలుపంచుకుంటామంటూ సంతకాలు చేశారు.