మాదాపూర్, ఏప్రిల్ 12: అనేక సంవత్సరాలుగా సాంప్రదాయ, ఆధునిక పద్ధతిలో నాణ్యమైన, నమ్మకంతో కూడిన బంగారు ఆభరణాలను తయారు చేస్తూ సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రజల ఆధారాభిమానాలతో విశేష సేవలందిస్తున్న సీఎంఆర్ లేగసి ఆఫ్ జ్యువెలర్స్ నూతనంగా మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ లో శనివారం cmrjewellers. com పేరుతో వెబ్‌సైట్‌తో పాటు క్యారెట్ కాయిన్‌ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ సింగర్ సునీత, యాంకర్ సుమ చేతుల మీదుగా వీటిని ఆవిష్కరించారు.
cmrjewellers.com వెబ్సైట్ లో 10 వేల కంటే ఎక్కువ డిజైన్స్ తో కూడిన సంప్రదాయ అధునాతన ఆభరణాలు అందుబాటులో ఉంటాయని, సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ ఆభరణాలను అభిమానించే అమెరికా, లండన్, ఆస్టేల్రియాతో పాటు ప్రపంచ దేశాల్లో ఉండే ఎన్ఆర్ఐ కస్టమర్ల కోసం ఈ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.
నాణ్యమైన, నమ్మకమైన బంగారు ఆభరణాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆన్లైన్లో షాపింగ్ చేయొచ్చని, వెబ్‌సైట్‌తో పాటు క్యారెట్ కాయిన్ణు పరిచయం చేయడం సంతోషంగా ఉందని సీఎంఆర్ జ్యువెలరీ సీఎండీ సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ సునీతాకుమారి అల్లాక తెలిపారు.
ఏప్రిల్ 12 నుంచి అక్షయ తృతీయ వరకు సైన్ అప్ చేసుకున్న కస్టమర్లకు రూ.లక్ష విలువగల క్యారెట్ నాణేలను అందించనున్నట్లు చెప్పారు. 11 నెలలకు సువర్ణ ప్రాప్తి పర్చేస్ ప్లాన్ లో ఫస్ట్ పేమెంట్‌గా క్యారెట్ కాయన్ని వినియోగించుకోవచ్చు అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ స్టోర్లలో ఏప్రిల్ 12 నుంచి అక్షయ తృతీయ వరకు ప్రతి కస్టమర్‌కు బంగారు నాణేలు, వెండి కాయిన్స్ గెలుచుకునే అవకాశంతో పాటు మరెన్నో అద్భుతమైన ఆఫర్లను అందించనున్నట్లు తెలిపారు.