దుండిగల్, అక్టోబర్ 1: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అతి పెద్ద షాపింగ్ మాల్ అయిన సీఎంఆర్‌లో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దసరా షాపింగ్ బొనాంజా ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవానికి ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దిన పత్రికల అడ్వైర్టెజ్‌మెంట్ విభాగం జనరల్ మేనేజర్ సురేందర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ దినేశ్ కుమార్ కల్వాణితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా సురేందర్‌రావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు దసరా పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారని తెలిపారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని దసరా ఉత్సవాలను ప్రజలు మరింత సంతోషంగా జరుకునేలా ‘దసరా షాపింగ్ బొనాంజా’ పేరుతో అక్టోబర్ 1వ తేదీ నుంచి 10 వరకు ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దిన పత్రికలు, ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్, కేఎల్ఎం షాపింగ్‌మాల్‌లు టైటిల్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న ఈ వేడుకల్లో సెలెక్ట్ మొబైల్స్, సీఎంఆర్ షాపింగ్ మాళ్లే మెయిన్ స్పాన్సర్లుగానూ, నిలోఫర్ కేఫ్ పవర్డ్బైగా వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా నగరంలోని ఎంపిక చేసిన ‘సీఎంఆర్’ షాపింగ్ మాల్లో కొనుగులు చేసిన ప్రతి ఒక్కరికి కూపన్లను అందజేస్తున్నట్లు తెలిపారు. ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ప్రతిరోజు లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు.
ప్రతిరోజు మొదటి బహుమతిగా 32 ఇంచుల కలర్ టీవీ, రెండో బహుమతిగా మొబైల్ ఫోన్, మూడో బహుమతిగా గిఫ్ట్ వోచర్, నాలుగు, ఐదో బహుమతులుగా గిఫ్ట్ హ్యాంపర్ అందించనున్నట్లు తెలిపారు. ఇలా పదిరోజుల పాటు ప్రతిరోజు ఐదు బహుమతులను అందజేయడంతోపాటు 11వ రోజున బంపర్ డ్రా తీసి విజేతకు ‘కారు’ అందజేయనున్నట్లు తెలిపారు. కూపన్లలో వివరాలు పొందుపరిచి డ్రాప్ బాక్స్‌లో వేయాలన్నారు. ఈ రోజు డ్రాప్ బాక్స్‌లో వేసిన కూపన్ల విజేతల వివరాలను మరుసటి రోజు ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దిన పత్రికల్లో తెలియపర్చనున్నట్టు స్పష్టం చేశారు.
దసరా కంటే మందే వినియోగదారులకు ఇండ్లల్లో పండుగ వాతావరణం కల్పించేందుకు ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఈ రకంగా ముందుకు వచ్చినట్లు తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇంకా, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దిన పత్రికల అడ్వైర్టెజ్‌మెంట్ విభాగం అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు రాజిరెడ్డి, రాములుతో పాటు సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ దినేశ్ కల్వాని పాల్గొన్నారు.
ఇటీవలే నిజాంపేటలో సీఎంఆర్ షాపింగ్ మాల్‌ను ప్రారంభించగా, స్థానికుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. అన్నిరకాల పట్టు, ఫ్యాన్సీ, డిజైనర్ దుస్తులతో పాటు కిడ్స్‌వేర్, మెన్స్‌వేర్, రెడీమేడ్స్, పార్టీవేర్లలో నాణ్యమైన దుస్తులు అందుబాటులో ఉంచాము. ప్రత్యేకంగా మహిళల కోసం అన్ని రకాల పట్టు చీరెలను అందుబాటులోకి తెచ్చాము. ఇక బంగారం కొనుగోలుదారుల కోసం పూర్తిగా 916 సర్టిఫైడ్, హాల్‌మార్క్ కలిగిన ఆభరణాలను మాత్రమే అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నగరంలోని ఏ షాపింగ్ మాల్లో లభించని వైరైటీ ఆభరణాలు మా వద్ద లభిస్తాయి. తమను ఆదరిస్తున్న కస్టమర్లకు దసరా షాపింగ్ బొనాంజాతో ప్రోత్సహిస్తున్న ‘నమస్తే తెలంగాణ’, తెలంగాణ టుడే’ దినపత్రికలతోపాటు ‘టీ న్యూస్’తోపాటు ఇందులో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. – దినేశ్ కుమార్ కల్వాని, సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్
చాలా బాగున్నాయి..
ఈరోజు ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో వచ్చిన షాపిం గ్ బొనాంజా స్కీమ్ వివరాలు చూసి మా ఇంటికి దగ్గర గా ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్‌లోకి వచ్చి షాపింగ్ చేశాం. ఇందులో దుస్తులు, బంగారు ఆభరణాలు చాలా బాగున్నాయి. చక్కని నాణ్యతను కలిగినప్పటికీ, ధరలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. చాలా వెరైటీలు ఇక్కడ లభించడం సంతోషంగా ఉంది. గతంలో దసరా ఇత్యాది పండుగల షాపింగ్ కోసం కూకట్పల్లి, అమీర్‌పేట వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. నిజాంపేటలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ఏర్పాటుతో దూరం వెళ్లాల్సిన బాధ తప్పింది. – అరుణ, గృహిణి, వసంతనగర్
నిజాంపేటలో సీఎంఆర్ షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేసినప్పటి నుంచి నేను ఇక్కడే షాపింగ్ చేస్తున్నాను. మా ఇంటిళ్లిపాదికి కావాల్సిన బట్టలన్ని ఇక్కడే దొరుకుతున్నాయి. పలు వెరైటీలతో పాటు ధరలు అందుబాటులో ఉండటంతో క్రమం తప్పకుండా మేము ఇందులోనే షాపింగ్ చేస్తున్నాం. బంగారు ఆభరణాలల్లోనూ మంచి మంచి డిజైన్లు ఇక్కడ లభించడం అభినందనీయం.
– నిర్మల, గృహిణి, బాచుపల్లి