సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కూకట్పల్లి జోన్కు సంబంధించి వివిధ శాఖల పనితీరుపై జోనల్ కమిషనర్, అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లతో సీఎంసీ కమిషనర్ సృజన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
పారిశుద్ధ్య సేవలకు అంతరాయం కలగకుండా సిబ్బందిని సకాలంలో భర్తీచేయాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు.